మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ అరెస్ట్..

చాగల్లు – మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తున్నారని ఇంటి వద్ద ఉన్న వారిని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అక్రమ అరెస్టులు చేశారని దీన్ని చాగల్లు సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఖండిస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు వేతన బకాయిలు ఉన్నాయి ఈ సమస్యపై కార్మికులు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టినా స్పందించడం లేదు రెండవ శనివారం స్కూలు సెలవు సెలవు సందర్భంగా ఇంటి వద్ద ఉన్న కార్మికులను తీసుకువెళ్లి అరెస్ట్ చేశారు గత ప్రభుత్వం వర్కర్స్ పట్ల ఏ విధంగావ్యవహరించిిందో అదే విధంగా కొత్త ప్రభుత్వం కూడా భోజన కార్మికుల పట్ల కార్మిక వర్గాల పట్ల అదే ధోరణి కోత్త ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిఐటియు మండల నాయకురాలు కే పోశమ్మ అన్నారు ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కష్టపడి పని చేస్తూ నెలల తరబడి జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం నమ్ముకుని ఉన్నతమ లాంటి వారికి జాలి చూపకపోగా ఇలాంటి విపరీత ధోరణి ప్రదర్శించడం మంచిది కాదని ఇకనైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు