నాగార్జునసాగర్ దగ్గర జలకళ… 6 గేట్లు ఎత్తివేత…

నాగార్జునసాగర్ దగ్గర జలకళ… 6 గేట్లు ఎత్తివేత…
Spread the love

తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షాలైతే పడలేదు కానీ… ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు… తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు చక్కగా నిండుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయి… ఏకంగా 10 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలాల్సి వచ్చింది. ఆ నీటి ప్రవాహంతో… నల్గొండలోని నాగార్జున సాగర్ నిండిపోయింది. దాంతో అధికారులు మొదట 4 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారురు.  ఉదయం 8 గంటలకు పూజలు చేసి ఈ కార్యక్రమం నిర్వహించారు. గంట తర్వాత మరో రెండు గేట్లు కూడా ఎత్తారు. పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెట్టింది. శ్రీశైలం దగ్గర ఎలాగైతే… వ్యూ అదిరిపోతుందో, నాగార్జున సాగర్ దగ్గర కూడా అలాగే నీరు కిందికి వచ్చే దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందువల్ల ఇప్పటి నుంచీ నాగార్జున సాగర్‌కు కూడా పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచీ… ఆదివారం రాత్రికి 7లక్షల 79వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. అందువల్ల సాగర్ డ్యాంకి 24 గంటల్లో 60 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఐతే… శ్రీశైలానికి 8లక్షల 46వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. అందువల్లే నీటిని కిందకు వదిలారు. మొత్తానికి జలాశయాలు నిండుతుండటం అందరికీ శుభ పరిణామం. ముఖ్యంగా రైతులకు సాగు నీరు అందించేందుకు ఈ నీరు ఎంతగానే ఉపయోగపడనుంది.

Admin

Admin

9909969099
Right Click Disabled!